Telugu Updates
Logo
Natyam ad

విస్తృతంగా వాహన తనిఖీలు..?

బ్లాక్ స్టిక్కర్ ను తొలగిస్తున్న పట్టణ సీఐ నారాయణ

మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో శుక్రవారం సాయంత్రం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. పట్టణ సిఐ నారాయణ నాయక్ ఆధ్వర్యంలో వాహనాల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించారు. సరైన పత్రాలు లేని వాహనాలకు జరిమానా విధించారు. అలాగే కార్ల అద్దాలకు ఉన్న బ్లాక్ స్టిక్కర్లు తొలగించారు. ప్రెస్ స్టిక్కర్లు ఉన్న వాహనదారుల వద్ద గుర్తింపు కార్డులు పరిశీలించి, లేని వారి వాహనాలకు ప్రెస్ స్టిక్కర్లు తొలగించారు. ఈ తనిఖీల్లో ఎస్సైలు గంగారం, హరిశేఖర్, తదితరులు పాల్గొన్నారు.