లక్షిట్టిపేటలో ఘనంగా బహుమతుల ప్రదానోత్సవం – విజేతలకు అభినందనలు

విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచే పోటీ పరీక్షలు – సివిల్ జడ్జ్ సాయికిరణ్
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: లక్షిట్టిపేట పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ సెకండరీ బాలికల పాఠశాలలో యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి టాలెంట్ టెస్ట్ బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. మండలంలోని పలు పాఠశాలల విద్యార్థులు ఈ టాలెంట్ టెస్ట్‌లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సివిల్ జడ్జ్ కె. సాయికిరణ్ మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు తమ ప్రతిభను కూడా పెంపొందించుకోవాలని సూచించారు. పోటీ పరీక్షలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి భవిష్యత్‌లో ఉన్నత స్థానాలను సాధించేందుకు దోహదపడతాయని అన్నారు. మండల విద్యాశాఖ అధికారి ఎంఈవో శైలజ మాట్లాడుతూ, విద్యార్థులు ఇలాంటి పరీక్షల్లో పాల్గొనడం ద్వారా వారి జ్ఞానం, ఆలోచనా సామర్థ్యం పెరుగుతుందని పేర్కొన్నారు. చదువులో క్రమశిక్షణతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి మాట్లాడుతూ లక్షిట్టిపేట మండలంలోని విద్యార్థుల ప్రతిభను వెలికితీయాలనే ఉద్దేశంతో ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహించామని తెలిపారు. విద్యార్థులు విద్యలో ముందుకు రావడానికి యుఎస్ఎఫ్ఐ ఎప్పటికప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు.

ఈ టాలెంట్ టెస్ట్‌లో లక్షిట్టిపేట మండలంలోని మొత్తం 9 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. పోటీ ఫలితాల్లో మండల స్థాయిలో మొదటి బహుమతి ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థిని రిషిక (లక్షిట్టిపేట), రెండవ బహుమతి ట్రినిటీ హైస్కూల్ విద్యార్థిని లక్ష్మీ ప్రసన్న, మూడవ బహుమతి ఆర్కేస్ ప్రైవేట్ పాఠశాల విద్యార్థిని దీర తీరి సాధించారు. విజేతలకు అతిథులు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గాండ్ల సత్యనారాయణ, కారుకురి సురేందర్, చెల్లా గణేష్, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ సిబ్బంది, వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

