ఆంజనేయులు న్యూస్, మందమర్రి: జాతీయ రహదారిపై టోల్ గేట్ల ఛార్జీలు 5 శాతం పెంచడంతో మంచిర్యాల జిల్లాలో వేలాది మంది వాహనదారులపై ప్రభావం చూపనుంది. మంచిర్యాల జిల్లా ఇందారం క్రాస్ రోడ్డు నుంచి రేపల్లివాడ వరకు 42 కి. మీ. దూరం జాతీయ రహదారి 363 నాలుగు వరుసల విస్తరణ పనులు ఏడాదిన్నర క్రితం పూర్తి చేశారు. దీంతో మందమర్రి పట్టణ శివారులో టోల్ గేట్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మందమర్రిలో రెండు నెలల క్రితం పూర్తిస్థాయిలో పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం వాహన పరిణామాన్ని బట్టి రూ.90.-570 వరకు వివిధ కేటగిరీల వారీగా రుసుం వసూలు చేస్తున్నారు. రోజు 8-9 వేల కార్లు, బస్సులు, భారీ, అతి భారీ వాహనాలు టోల్ గేట్ మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రస్తుతం 8-9 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో టోల్ చార్జీలు ధరలు పెరగక ముందు నిత్యం వీరి నుంచి రూ.7-9 లక్షలు వసూలయ్యాయి. సోమవారం నుంచి 5 శాతం టోలా ఛార్జీలు పెంచడంతో ఒక్కో వాహనదారుడిపై సుమారు రూ.15-140 వరకు అదనపు భారం పడుతుంది. ఇలా రోజూ రూ.1-2 లక్షల భారం అదనంగా ఆదాయం సమకూరనుందని సమాచారం.