మంచిర్యాల జిల్లా: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సారథ్యంలోని టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గాల్లో మంచిర్యాలకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. కోట్లాది నిధులతో జరిగిన, జరగబోయే అభివృద్ధి ప్రతిపక్ష పార్టీలకు కనబడటం లేదా అని ఆయన ప్రశ్నించారు. రూ. 9.50 కోట్లతో అండర్ బ్రిడ్జి నిర్మాణం పూరై ప్రారంభించడం జరుగుతుందని, దీనివల్ల హమాలివాడ, తిలక్ నగర్, రాజీవ్ నగర్, గాంధీ నగర్, అమరవాది, చున్నం బట్టి వాడ ప్రాంత ప్రజలకు ఎంతో సౌలభ్యంగా ఉండి, ఆ ప్రాంతం కూడ ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. పనికిమాలిన ప్రచారం చేసే వారికి ప్రజలు తగిన గుణపాఠం చెపుతారని ఎమ్మెల్యే అన్నారు.