ఆంజనేయులు న్యూస్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర రైతులకు అదిరిపోయే శుభవార్త అందింది. దసరా లోపు రైతు భరోసా నిధులు రిలీజ్ చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్నాహాలు.. చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈనెల 20వ తేదీ అంటే రేపు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఉంది. ఈ సమావేశంలో రైతు భరోసా నిధుల పైన ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన రైతు భరోసా నిధులను రిలీజ్ చేసేందుకు…రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎకరానికి 15వేల రూపాయల చొప్పున…ఏడాది మొత్తంలో రైతుల ఖాతాలో జమ చేస్తామని కాంగ్రెస్..ఎన్నికల ప్రచారంలో చెప్పింది.ఇప్పుడు ఆ డబ్బులను దసరా లోపు వెయ్యాలని అనుకుంటుంది.ప్రస్తుత లెక్కల ప్రకారం 1. 53 కోట్ల ఎకరాలకు. 11475 కోట్లు ఖర్చు అవుతుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంచనా వేసింది. ఇక రేపు తెలంగాణ కేబినెట్ సమావేశంలో ఈ డబ్బులు రిపీట్ చేసేందుకు. రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.