మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఐపిఎస్.
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నూతన మెను పట్టిక విధానం లో విద్యార్థుల కు నాణ్యమైన పౌష్టిక ఆహారం అందించాలనే ఉద్దేశ్యం తో రెసిడెన్షియల్ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ విద్యాలయాలు ఆశ్రమ పాఠశాలలు మోడల్ స్కూల్స్ లలో కామన్ మెన్యూ కార్యక్రమం అమలు లో భాగంగా మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఐపిఎస్., శనివారం ఇతర ప్రభుత్వ అధికారులతో కలిసి పోస్ట్ మెట్రిక్ ST బాయ్స్ హాస్టల్ బైపాస్ రోడ్, మంచిర్యాలలో హాజరయ్యారు.. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ…. విద్యార్థి దశ నుండి క్రమశిక్షణ మరియు మంచి నడవడికతో టీచర్ లు చెప్పే పాఠలు, మంచి విషయాలు శ్రద్ద గా విని మంచిగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉండాలన్నారు. జీవితంలో మంచిగా చదవడం వల్ల ఏదైనా సాధించవచ్చు అని ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు అన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు.
సిబ్బంది తో మాట్లాడుతూ.. పాఠశాల మరియు రెసిడెన్షియల్ స్కూల్స్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఎలాంటి పొరపాట్లు జరగకుండా పరిశుభ్రత విషయం లో పలు జాగ్రత్తలు తీసుకోవాలని, వంటకు ఉపయోగించే నీటి ట్యాంక్ లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలనీ సూచించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ ప్రమోదరావు, స్కూల్ టీచర్స్, హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.