Friday, July 3, 2026
HomeTelanganaశ్రీరామనవమి సందర్భంగా కాసిపేట లో భారీ అన్నదానం

శ్రీరామనవమి సందర్భంగా కాసిపేట లో భారీ అన్నదానం

📰 Generate e-Paper Clip

 

ఆంజనేయులు న్యూస్, తాండూర్: మంచిర్యాల జిల్లా, తాండూర్ మండలం పరిధిలో కాసిపేట గ్రామంలో గురువారం శ్రీ రామ నవమి సందర్భంగా గ్రామ హనుమాన్ భక్తుల ఆధ్వర్యంలో భారీ అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.. ఈ సందర్భంగా హనుమాన్ భక్తులు మాట్లాడుతూ.. ముందుగా గ్రామంలోని పేరుపేరునా కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్నదాన కార్యక్రమంలో మీ కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించినందుకు శ్రీ రాములు వారి కృపాకటాక్షాలు మీ అందరిపై ఉండాలని రాములు వారి చల్లని దీవెనలు తో ప్రతి ఒక్కరి సర్వ విఘ్నాలు తొలగిపోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ..

Post Midle

• గ్రామ ప్రజలకు తెలియజేయునది.

మన గ్రామస్తులకు తెలియజేయునది మరో విషయం ఏమిటంటే మన హనుమాన్ గుడిలో నవగ్రహాలు విరిగి పాడైపోయాయి ఇలా ఉండడం మన ఊరికి అరిష్టం అంటున్నారు వేద పండితులు, అలాగే ఆలయ పరిసర ప్రాంతం కిందికి కుంగి ఇరుకుగా ఉండి కడిగిన వాటర్ వెళ్లలేక డ్రైనేజీకి చాలా ఇబ్బంది అవుతుంది.. ఇట్టి విషయాన్ని గ్రామ పెద్దలు అందరూ గమనించి, గ్రామ ప్రజలతో చర్చించి, గ్రామ ప్రజలు మరియు దాతల సహాయంతో ఆలయంలోని సమస్యలను పరిష్కరించి, నవగ్రహాలను అంగరంగ వైభవంగా ప్రతిష్టించాలని గ్రామ హనుమాన్ భక్తులు కోరుతున్నారు..

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJI News App

Add to home screen for faster loading and latest updates.