Telugu Updates
Logo
Natyam ad

కార్మిక చైతన్య యాత్రను ప్రారంభించిన: ఈటెల

మంచిర్యాల జిల్లా: సింగరేణి సంస్థ, కార్మికుల గురించి సీఎం కేసీఆర్ కేంద్రంతో ఒక్కసారి కూడా మాట్లాడలేదని, అలా మాట్లాడినట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా అని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సవాల్ విసిరారు. బిఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్మిక చైతన్య యాత్రను శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 6 గనిపై సోమవారం ఆయన మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామితో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణిలో 51 శాతం రాష్ట్ర వాటా ఉండగా, 49 శాతం వాటా వున్న కేంద్రం ఏనాడైన జోక్యం చేసుకుందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. బొగ్గు ఉత్పత్తి ప్రతి సంవత్సరం పెరుగుతుంటే కార్మికుల సంఖ్య పెరగకుండా ఎందుకు తగ్గుతుందో చెప్పాలని నిలదీశారు. వేల కోట్ల టర్నోవర్ ఉన్న సింగరేణి సంస్థ జీతభత్యాల కోసం బ్యాంకుల వద్ద అప్పులు తీసుకునే పరిస్థితికి సీఎం కేసీఆర్ దిగదార్చారని తీసుకొచ్చారని ఆయన విమర్శించారు. కార్మికులు, నాయకులు టీబీజీకేఎస్ లో తప్ప వేరే సంఘంలో చేరితే దూరంగా ట్రాన్స్ ఫర్ చేస్తూ బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు..