Telugu Updates
Logo
Natyam ad

పారిశుద్ధ్య నిర్వహణ ప్రతి ఒక్కరి బాధ్యత

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: పారిశుద్ధ్య నిర్వహణపై సంబంధిత శాఖల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ క్రమంలో ప్రజలు వ్యక్తిగత శుభ్రతతో పాటు తమ నివాస ప్రాంతాల పరిశుభ్రత బాధ్యతగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం మున్సిపల్ కమీషనర్ మారుతి ప్రసాద్ కలిసి మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో పర్యటిస్తూ పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందని, ఈ క్రమంలో మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలలో పారిశుద్ధ్య నిర్వహణపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం గర్మిళ్ళ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మిక సందర్శించి తరగతి గదులు, పరిసరాలు, రిజిస్టర్లు, రికార్డులు, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఉపాధ్యాయులు విధుల పట్ల సమయపాలన పాటిస్తూ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి, మరమ్మత్తు పనులను అధికారుల సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.