Telugu Updates
Logo
Natyam ad

ప్రమాదాల నివారణకు చర్యలు..?

ఓవర్‌ లోడ్‌తో వెళ్తున్న కర్ర లారీలపై పెద్దపల్లి పోలీసులు కొరఢా ఝుళిపించారు..

పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లి పట్టణంలోని రంగంపల్లి వద్ద సీఐ ప్రదీప్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఓవర్‌ లోడ్‌ తో వెళ్తున్న కర్ర లారీలను ఆపి డ్రైవర్స్‌కు సూచనలు చేశారు. ఈసందర్బంగా సీఐ మాట్లాడుతూ.. లారీలు ఓవర్‌ లోడ్‌, అతి వేగంగా వెళ్లడం వల్ల తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. లారీకి బయటకు వచ్చేలా కర్రలు ఉంటే విద్యుత్‌ తీగలకు తగిలి షార్ట్‌ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగే అవకాశాలున్నాయన్నారు. అలాగే ఓవర్‌ లొడ్‌తో డ్రైవర్స్‌కి లారీ బ్యాలెన్స్‌ చేయడం కూడా కష్టతరమవుతుందన్నారు. ఇలాంటి లారీలు రోడ్లపై నిలిచిపోయిన సమయంలో ట్రాఫిక్‌కు కూడా అంతరాయం కలుగుతుందన్నారు. నిబంధనలకు విరుద్దంగా ఓవర్‌ లోడ్‌తో వెళ్లిన లారీలను సీజ్‌ చేయడంతోపాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈకార్యక్రమంలో ట్రాఫిక్‌ సీఐ అనిల్‌కుమార్‌, ఎస్ఐ రాజేష్ తోపాటు సిబ్బంది పాల్గొన్నారు..