Telugu Updates
Logo
Natyam ad

సోమేశ్ కుమార్ రిట్ పిటిషన్ ను తొక్కిపెడుతున్నదెవరు?: రఘునందన్

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేశ్ కుమార్ పై వేసిన రిట్ పిటిషన్ ఐదేళ్లు గడుస్తున్నా హైకోర్టు బెంచ్ ముందుకు ఎందుకు రావడం లేదని భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. విచారణకు రాకుండా తొక్కి పెడుతున్నదెవరు?, ప్రధాన న్యాయమూర్తి ముందుకు రాకుండా ఎందుకు ఆగిందో తెలియాలన్నారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరగాలని  కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాసినట్లు వివరించారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. నిబంధనల ప్రకారం సోమేశ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన అధికారి అని చెప్పారు. ఆయనతో పాటు మరో 12 మంది అధికారులు కూడా ఆంధ్రాకు కేటాయించిన అధికారులే అని.. వారంతా నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణలో కొనసాగుతున్నారని తెలిపారు..