మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రజా శ్రేయస్సు, జిల్లా అభివృద్ధి కొరకు అందరం సమిష్టిగా కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఐ.ఎ.ఎస్. అధికారుల బదిలీలలో భాగంగా జిల్లాకు వచ్చిన కుమార్ దీపక్ ఆదివారం నూతన జిల్లా కలెక్టర్ గా జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమ, అభివృద్ధి కొరకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ఫలాలను జిల్లాలో అర్హత గల ప్రతి ఒక్కరికి అందే విధంగా అధికార యంత్రాంగంతో కలిసి పని చేస్తానని అన్నారు. నూతన జిల్లా కలెక్టర్ గా వచ్చిన కుమార్ దీపక్ కు జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాహుల్, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్, మంచిర్యాల రాజస్వ మండల అధికారి వి. రాములు, కలెక్టరేట్ పరిపాలన అధికారి పిన్న రాజేశ్వర్, ఎన్నికల తహసిల్దార్ శ్రీనివాస్, నస్పూర్ తహసిల్దార్ శ్రీనివాస్ లు స్వాగతం పలికారు. నాగర్ కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) గా విధులు నిర్వహించిన కుమార్ దీపక్ పదోన్నతిపై జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఫిబ్రవరి 1, 2023 నుండి జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహించిన బదావత్ సంతోష్ బదిలీపై వెళ్లారు.