Telugu Updates
Logo
Natyam ad

ప్రజావాణి ద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి

మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ కుమార్ దీపక్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు చేసుకున్న దరఖాస్తులను అధికారుల సమన్వయంతో క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో బెల్లంపల్లి రాజస్వ మండల అధికారి హరికృష్ణతో కలిసి అర్జిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. మంచిర్యాల పట్టణానికి చెందిన మేదరి సాగర్ హాజీపూర్ మండలం దొనబండ గ్రామ శివారు నందు తన భార్య పేరిట 50 సంవత్సరాల క్రితం భూమి కొనుగోలు చేశానని, అప్పటి నుండి ఆ భూమి తన స్వాధీనంలోనే ఉందని, ఒక వ్యక్తి ధరణిలో అక్రమంగా ఇట్టి భూమి తన పేరిట మార్చుకున్నారని, ఈ విషయమై సమగ్ర విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. గుల్లకోట గ్రామానికి చెందిన కె.ప్రవీణ్ తనకు ఆర్. ఆర్. ప్యాకేజీ కింద రావలసిన డబ్బులను ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.