వికారాబాద్ జిల్లా: లో దారుణం చోటుచేసుకుంది. పూడూరు మండల పరిధిలోని ఓ గ్రామంలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు చాకలి రవి, చింటు యాదవ్ బుధవారం రాత్రి బాలికను బలవంతంగా ఇంటి నుంచి సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో బాలికను గుర్తించి ఇద్దరు యువకులను పోలీసులకు అప్పగించారు. ఎస్సై శ్రీశైలం ఘటనాస్థలానికి చేరుకుని బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.