
మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్
ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ విధానం అమలు
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలే
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనదారులకు జరిమానాలు తప్పవని మంచిర్యాల ఇంచార్జి డీసీపీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా కేంద్రం లో సిసి కెమెరాల పనితీరును పరిశీలించారు. అనంతరం డిసీపీ మాట్లాడుతూ. జిల్లా కేంద్రంలోని సీసీ కెమెరాలు డిస్ట్రిబ్యూటెడ్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్ మెంట్ సిస్టం తో కనెక్ట్ చేశామని ఇకపై ట్రాఫిక్ నిబంధనలు పాటించినట్లయితే సిసి కెమెరాల ద్వారా జరిమానాలు వేయడం జరుగుతుంది అని వాహనదారులు హెల్మెట్ లేకుండా ప్రయాణించిన, ట్రిపుల్ రైడింగ్ చేసిన, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినా ఆటోమెటిగ్గా ఈ చాలన్ ద్వారా జరిమానాలు పడతాయన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలతో పాటు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి, మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ నారాయణ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ పాల్గొన్నారు.

