Friday, July 3, 2026
HomeTelanganaజాతీయ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా సిరిపురం రాజేశ్

జాతీయ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా సిరిపురం రాజేశ్

📰 Generate e-Paper Clip

Post Midle

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధికార ప్రతినిధిగా తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ న్యాయవాది సిరిపురం రాజేశ్ ను నియమించినట్లు మాజీ ఎం.ఎల్.సి. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ స్టాటజీ కమిటీ చైర్మన్ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ నియామకపు ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా సిరిపురం రాజేశ్ మాట్లాడుతూ.. నాపై నమ్మకం ఉంచి అత్యంత కీలకమైన జిల్లా పదవిని ఇచ్చిన ప్రేమ్ సాగర్ రావు కి, సురేఖ కి హృదయపూర్వక ధన్యవాదాలు అన్నారు. ఈ పదవి తెలంగాణ ఉద్యమకారులకు దక్కిన గౌరవమని అన్నారు. నాలాంటి ఎందరో ఉద్యమకారుల కృషి ఫలితంగా, తెలంగాణ యువత బలిదానాలతో, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చలువతో ఏర్పడిన తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టి.ఆర్.ఎస్. నేడు దళారులు, అవినీతిపరుల మయమైందని అన్నారు. రాబోవు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయానికి అహర్నిశలు కృషి చేస్తామని అన్నారు. సిరిపురం రాజేశ్ ఎన్నికల పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు బెల్లంకొండ మురళి, సింగతి మురళి, బొడ్డు శంకర్, రిటైర్డ్ హెడ్మాస్టర్ బలబద్రపాత్రుని శంకర్ రావు, ఆర్యవైశ్య సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి చిలువేరు నాగేశ్వర్ రావు, రాష్ట్ర మాల సంఘాల జె.ఎ.సి. ప్రచార కమిటీ చైర్మన్ సాగె సుమోహన్, బొడ్డు తిరుపతి, ఉపసర్పంచ్ ల సంఘం జిల్లా అధ్యక్షులు మాధవరపు జితేందర్రావు, జెడ్.పి.టి.సి. పూస్కూరి శిల్పా – శ్రీనివాస్ రావు, మాజీ సర్పంచులు గోనె సంజయ్ కుమార్, గోనె సతీష్ రావు, ఎడ్ల మల్లేష్, కంకణాల శ్యామసుందర్, చంద్రమొగిలిరెడ్డిలు హర్షం వ్యక్తం చేశారు.

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJI News App

Add to home screen for faster loading and latest updates.