Telugu Updates
Logo
Natyam ad

పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ వెంచర్లు

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గర్మిళ్ల శివారు రాజీవ్ నగర్ లో అక్రమ వెంచర్‌ వెలసింది.

మంచిర్యాల మున్సిపల్‌, రెవెన్యూ అధికారుల కండ్లు కప్పి అనాదికారంగా లే-అవుట్‌ ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తున్నది.

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని అక్రమ వెంచర్‌ వెలసింది. మంచిర్యాల మున్సిపల్‌, రెవెన్యూ అధికారుల కండ్లు కప్పి అనధికారంగా లే-అవుట్‌ ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తున్నది. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 152/1/1/3 గరిమెళ్ళ శివారు రాజీవ్ నగర్ లో 1 ఎకరం లో ఈ లే-అవుట్‌ను ఏర్పాటు చేశారు. మున్సిపల్ రెవెన్యూ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఈ వెంచర్ ను అమ్మకానికి పెట్టారని సమాచారం.. ఇప్పటికైనా సంబంధిత అధికారులు గమనించి అక్రమ వెంచరు వేసిన కొంతమంది రియాల్టర్ల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అక్కడున్న స్థానికులు కోరుతున్నారు.