Thursday, July 2, 2026
HomeTelanganaబస్ స్టేషన్ లో ఎమ్మార్పీ ధరలకే వస్తువులు విక్రయించాలి

బస్ స్టేషన్ లో ఎమ్మార్పీ ధరలకే వస్తువులు విక్రయించాలి

మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో ఉన్న దుకాణాల్లో వస్తువులు ప్రయాణికులకు ఎమ్మార్పీ ధరలకే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం తెలంగాణ వినియోగదారుల ఫోరం, డీజేఎఫ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బస్టాండ్ లోని షాపు యజమానులు అధిక ధరలకు వస్తువులు విక్రయిస్తూ ప్రయాణికులను దోచుకుంటున్నారని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, నాణ్యత గల వస్తువుల అమ్మకాలు జరిగేలా చూడాలని వారు కోరారు..

Post Midle

ఈ కార్యక్రమంలో తెలంగాణ వినియోగదారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు కర్రె రాజేశ్వర్, ఉపాధ్యక్షుడు పొట్ట మధుకర్, డిజెఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు తీగల శ్రీనివాస్ రావు, నాయకులు ముత్తే రమేష్, భూమన్న, తదితరులు పాల్గొన్నారు..

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJ News App

Add to home screen for faster loading and latest updates.