Wednesday, August 19, 2026
HomeTelanganaవిజయ డెయిరీ రైతులకు గుడ్ న్యూస్.?

విజయ డెయిరీ రైతులకు గుడ్ న్యూస్.?

📰 Generate e-Paper Clip

రంగారెడ్డి: విజయ డెయిరీ రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పాల సేకరణ ధరను పెంచుతున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. లీటర్ గేదె పాల ధర రూ.46.69 నుంచి రూ.9.40, ఆవు పాల ధర రూ.33.75 నుంచి రూ.38.75కు పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు. ఈ మేరకు రాజేంద్రనగర్ లో ఏర్పాటు చేసిన పాడి రైతుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పాడి రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పాడి గేదెలకు ఉచితంగా మందులు, వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. నష్టాల్లో ఉన్న విజయ డెయిరీ తెలంగాణ ఏర్పడ్డాక లాభాల్లోకి వచ్చిందని మంత్రి తలసాని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.