జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం కార్యనిర్వాహక సంచాలకులు సి.హెచ్.దుర్గాప్రసాద్
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: షెడ్యూల్డ్ కులాల కార్పొరేషన్ కు సంబంధించి జిల్లాలోని కోటపల్లి మండల కేంద్రంలో గల 5 దుకాణాలను నెలవారి అద్దె ప్రాతిపదికన కేటాయించేందుకు షెడ్యూల్డ్ కులముల వారి నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం కార్యనిర్వాహక సంచాలకులు సి.హెచ్.దుర్గాప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల వయసు 21-50 సంవత్సరాల మధ్య ఉండాలని, సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి 1 లక్ష 50 వేల రూపాయలకు మించి ఉండకూడదని, కనీస విద్యార్హత 5వ తరగతి చదువుకుని ఉండాలని తెలిపారు. దరఖాస్తు ఫారంను కార్యాలయ పని వేళలలో ఉచితంగా పొందవచ్చని, కోటపల్లి మండలానికి చెందిన నిరుద్యోగ అభ్యర్థులు ఈ నెల 25వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని ఎఫ్-3 బ్లాక్, మొదటి అంతస్తులోని జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని తెలిపారు. కోటపల్లి మండలానికి చెందిన షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.