Friday, July 3, 2026
HomeTelanganaమెగా రక్త దానం శిబిరం

మెగా రక్త దానం శిబిరం

📰 Generate e-Paper Clip

రామగుండం సిపి రెమా రాజేశ్వరి

Post Midle

ఆంజనేయులు న్యూస్, పెద్దపల్లి జిల్లా: ఆపదలో ఉన్నవారికి ప్రాణదానం చేసేందుకు పెద్దపల్లి పోలీసులు మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. ఈనెల 13న పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో మెగా రక్తదాన శిబిరం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. 5,555 మంది యువతీ యువకులతో రక్తదానం చేయించేందుకు సనాహాలు చేశారు. ఇంత పెద్ద సంఖ్యలో గతంలో ఎన్నడూ రక్తదాన శిబిరం జరగలేదని, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకోబోతుందన్నారు. రామగుండం సిపి రెమా రాజేశ్వరి, డిసిపి వైభవ్ గైక్వాడ్ ల ఆదేశాల మేరకు పెద్దపల్లి సబ్ డివిజన్ లోని శిబిరం ఏర్పాటు చేశామని, ఇప్పటికే 5వేల మందికి పైగా యువతీ యువకులు రక్తదానం చేసేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. యువత రక్తదానం చేసిన ముందుకు రావాలని, రక్తదానం ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేస్తుందన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ, లయన్స్ క్లబ్ సహకారంతో శిబిరం నిర్వహిస్తున్నామన్నారు.

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJI News App

Add to home screen for faster loading and latest updates.