మంత్రి హరీష్ రావు షాద్ నగర్ షెడ్యూలు ఖరారు
*మే 11న జేపీ దర్గా, కేశంపేట, షాద్ నగర్, ఎక్లాస్ ఖాన్ పేట, అల్వాల, కొత్తపేట, ఇప్పలిపల్లి గ్రామాల్లో మంత్రి పర్యటన*
*పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు పాల్గొననున్న మంత్రి*
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్,:
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పర్యటన అధికారికంగా ఖరారైంది. ఈ మేరకు ఆయన షెడ్యూల్ కు సంబంధించిన వివరాలను ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కార్యాలయ వర్గాలు సోమవారం సాయంత్రం విడుదల చేశాయి. ఈనెల 11వ తేదీన నియోజక వర్గంలోని కొత్తూరు మండలం జహంగీర్ పీర్ దర్గాలో 2గంటల 15 నిమిషాలకు బాబా దర్శనం చేసుకొంటారు. అదేవిధంగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ స్వగ్రామమైన ఎక్లాస్ ఖాన్ పేటలో 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత 2 గంటల 45 నిమిషాలకు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ స్వగృహంలో కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం 3గంటల 10 నిమిషాలకు అల్వాల గ్రామంలో రైతు వేదికను ప్రారంభిస్తారు. 3 గంటల 15 నిమిషాలకు కొత్తపేటలో రైతు వేదికను ప్రారంభిస్తారు. అలాగే మూడున్నర గంటలకు కేశంపేట ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో స్థాయి పెంపులో భాగంగా 30 పడకల ఆసుపత్రిగా నిర్మాణం చేస్తూ ఈ కార్యక్రమానికి శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా సాయంత్రం 4 గంటలకు ఇప్పలపల్లి గ్రామంలో రైతు వేదికను ప్రారంభిస్తారు. సాయంత్రం నాలుగు గంటల 45 నిమిషాలకు షాద్ నగర్ పట్టణంలో 50 పడకల కమ్యూనిటీ ఆసుపత్రిని ఏరియా ఆసుపత్రిగా మారుస్తూ ప్రభుత్వం వంద పడకల ఆసుపత్రికి శంఖుస్థాపన కార్యక్రమం చేపడతారని పేర్కొన్నారు. సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభలో హరీష్ రావు మాట్లాడతారు. తిరిగి సాయంత్రం ఏడు గంటలకు హరీష్ రావు హైదరాబాద్ కు బయలుదేరి వెళ్తారని కార్యాలయ వర్గాలు ప్రకటించాయి..