
మంచిర్యాల జిల్లా: స్వతంత్ర భారత వత్రోత్సవాలను పురస్కరించుకొని విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మంచిర్యాలలోని జెడ్పీ బాలుర పాఠశాలలో ఉపాధ్యాయులకు మండల స్థాయి కవితా రచన పోటీలు నిర్వహించారు. భారతదేశం- కీర్తి విశిష్టత అనే అంశంపై జరిగిన ఈ పోటీల్లో మంచిర్యాల, నస్పూర్, హాజీపూర్, మందమర్రి మండలంలో పనిచేసే ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో మండలానికి రెండు ఉత్తమ కవితలను ఎంపిక చేసినట్లు ఎంఈఓ జాడి పోచయ్య, జిల్లా విద్యాశాఖ గ్రీన్ కోర్ జిల్లా కోఆర్డినేటర్, ప్రముఖ కవి గుండేటి యోగేశ్వర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ హెచ్ఎం ఎ. వేణుగోపాల్, మండల విద్యా వనరుల కేంద్రం సీఆర్పి సరిత, నాగేందర్ బాబు, స్వామి, శ్యామ్ పాల్గొన్నారు.

