Thursday, July 2, 2026
HomeTelanganaమధ్యాహ్న భోజన కార్మికుల అక్రమ అరెస్టులు ఖండించిన సిఐటియు

మధ్యాహ్న భోజన కార్మికుల అక్రమ అరెస్టులు ఖండించిన సిఐటియు

📰 Generate e-Paper Clip

Post Midle

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మధ్యాహ్న భోజన కార్మిక సంఘం (సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా హైదరాబాద్ వెళ్తున్న , వెళ్లిన మధ్యాహ్న భోజన కార్మికుల అక్రమ అరెస్టులు, కార్మికులపై జరిగిన దాడిని నిరసిస్తూ గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్లే కార్డుల ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దాసరి రాజేశ్వరి, ఎండి రఫీయా మధ్యాహ్న భోజన కార్మిక సంఘం (సిఐటియు) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ…. ఎన్నికల ముందు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలని , మా పెండింగ్ బిల్లులు చెల్లించాలని, కొత్త మెనూ కు బడ్జెట్ ను పెంచాలని తదితర డిమాండ్ల పైన హైదరాబాద్ వెళ్తే ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసుల చేత అక్రమంగా అరెస్టు చేసి, మాట్లాడిన నాయకుల పైన కార్మికుల పైన దాడి చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పే కాంగ్రెస్ పాలన అంటే ఇదేనా…? మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్త సమ్మె చేస్తామన్నారు. దుంపల రంజిత్ కుమార్ సిఐటియు జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ… నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికుల అక్రమ అరెస్టులను, దాడులను సిఐటియు మంచిర్యాల జిల్లా కమిటీగా ఖండిస్తున్నాం. కార్మికులంటే నీ కింద పని చేసే బానిసలు కాదు. అదేవిధంగా అధికారులు మధ్యాహ్న భోజన కార్మికులకు ఫోన్లు చేసి మీరు ఏ సంఘంలో ఉన్నారు, మీ ఆధార్ కార్డు వివరాలు చెప్పాలని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కార్మికులను ఇబ్బందులు పెట్టి, భయాబ్రాంతులకు గురి చేస్తే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో మానస, పద్మ, వెంకటమ్మ, కళావతి, నహీమున్నిసా, విజయ, భాగ్య, తదితరులు పాల్గొన్నారు.

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJ News App

Add to home screen for faster loading and latest updates.