రామగుండం పోలీస్ కమిషనరేట్: లోన్ యాప్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమీషనర్ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. ఉన్న చోటే రుణం పొందండి అనే సందేశాలు చూసి ప్లేస్టోర్ లో రిజిస్ట్రేషన్ లేని లోన్ యాప్స్ డౌన్ లోడ్ చేసుకుని నిబంధనలకు అనుమతి ఇస్తే సమాచారం అంతా సైబర్ నేరగాళ్ల చేతికి పోతుందన్నారు. రుణాలు ఇచ్చి అధిక వడ్డీలతో వసూలు చేయడం, మొత్తం డబ్బులు చెల్లించిన క్లియర్ కాలేదని బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఆన్ లైన్ లో రుణాలు తీసుకోని యువత, మహిళలు మోసపోవద్దని తెలిపారు. తెలియని నంబర్ నుండి మోసపూరిత సందేశం లేదా కాల్ వస్తే పోలీసులకు లేదా సైబర్ సెల్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు..