
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే బతుకమ్మ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. చివరి రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం కాసిపేట గ్రామం హనుమాన్ కాలనీలో సోమవారం సాయంత్రం నుండి మంగళవారం మధ్యాహ్నం వరకు సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా, ఆకర్షణీయంగా నిర్వహించారు.. పెద్ద పూలతో అలంకరించిన బతుకమ్మలను తెచ్చి, ఆడపడుచులు, మహిళలు, పిల్లలు కలిసి భక్తిశ్రద్ధలతో ఉయ్యాల పాటలు పాడుతూ ఆనందంగా పండుగను జరుపుకున్నారు. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై, తీరొక్క పూలతో అలంకరించిన సద్దుల బతుకమ్మతో ముగిసిన ఈ పండుగలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సాంప్రదాయ పాటలతో బతుకమ్మ ఆటలు ఆడుతూ, గౌరమ్మగా కొలిచిన బతుకమ్మలను స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు.

