Telugu Updates
Logo
Natyam ad

అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు..!

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి: ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ కొమ్మనబోయిన సీతారాములను అరెస్టు చేసినట్లు మంచిర్యాల జోన్ ఇంచార్జి డిసిపి అఖిల్ మహాజన్ తెలిపారు. బెల్లం పల్లి రూరల్ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఏసిపి ఎడ్ల మహేష్ తో కలసి ఆయన వివరాలను వెల్లడించారు. 2009వ సంవత్సరంలో దొంగతనాలను ప్రారంభించిన సీతారాములు పై 21 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం తాళ్ల గురజాల పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ బాబురావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించినట్లు తెలిపారు. అతని వద్ద ఉన్న సంచీని తనిఖీ చేయగా విలువైన బంగారం పట్టు బడిందని చెప్పారు. సీతా రాములు నుండి ఏడు లక్షల విలువ గలిగిన 14 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు…