Telugu Updates
Logo
Natyam ad

స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఈ నెల 15వ తేదీన అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్, మంచిర్యాల, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారులు వి.రాములు, హరికృష్ణలతో కలిసి జిల్లా అధికారులతో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 15వ తేదీన జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో నిర్వహించనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఘనంగా నిర్వహించాలని తెలిపారు. డి.సి.పి., రాజస్వ మండల అధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, మంచిర్యాల-నస్పూర్ మున్సిపల్ కమీషనర్లు, తహశిల్దార్ల సమన్వయంతో పరేడ్ గ్రౌండ్ ఏర్పాట్లు, ఆర్.డి.ఓ., డి.ఆర్.డి.ఓ., మంచిర్యాల- నస్పూర్ మున్సిపల్ కమీషనర్లు, నస్పూర్ తహశిల్దార్ల సమన్వయంతో ప్రొటోకాల్ ప్రకారం సీట్లు, వేదిక, కుర్చీలు, టెంట్లు, షామియానాలు, సౌండ్ సిస్టమ్ ఏర్పాట్లు, నస్పూర్ మున్సిపల్ కమీషనర్ ఆధ్వర్యంలో త్రాగునీరు, గ్రౌండ్ వాటరింగ్, బెల్లంపల్లి ఎ.సి.పి., జిల్లా విద్యాధికారి, ఇంటర్మీడియట్ అధికారి సమన్వయంతో జాతీయ గీతాలాపన, పోలీస్ బాండ్, సాంస్కృతిక కార్యక్రమాలు, డి.సి.పి., బెల్లంపల్లి ఎ.సి.పి., ఆర్.ఐ. (ఎ.ఆర్.)ల ఆధ్వర్యంలో జాతీయ పతాక ఏర్పాట్లు, జిల్లా పౌరసంబంధాల అధికారి ఆధ్వర్యంలో ప్రసంగ ప్రతి తయారు, కలెక్టరేట్ పరిపాలన అధికారి, ప్రొటోకాల్ విభాగం పర్యవేక్షకులు, తహశిల్దార్లు కమీషనర్ల సమన్వయంతో ఆహ్వాన పత్రికల ముద్రణ, పంపిణీ, ప్రశంసా పత్రాల తయారు చేయాలని తెలిపారు. అటవీ, వ్యవసాయ ఉద్యానవన పట్టు పరిశ్రమ, మత్స్య పశు సంవర్ధక, మిషన్ భగీరథ, గ్రామీణ నీటి పారుదల, పంచాయతీ పంచాయత్ రాజ్, వైద్య-ఆరోగ్యశాఖ ఐ.సి.డి.ఎస్. ఆబ్కారీ-మద్యనిషేధ, అగ్నిమాపక, విద్య-ఇంటర్మీడియట్ విద్య  వయోజన విద్య, పరిశ్రమలు  ఎస్.సి.సి.ఎల్., సంక్షేమశాఖల ఆధ్వర్యంలో సంక్షేమాభివృద్ధి పథకాలు ప్రదర్శించేలా శఖటాల ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అటవీ, సంక్షేమం, వ్యవసాయ ఉద్యానవన, పశుసంవర్ధక మత్స్య, పంచాయతీ, ఐ.సి.డి.ఎస్. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, విద్య వయోజనవిద్య, ఆబ్కారీ- మద్యనిషేధ, వైద్య-ఆరోగ్య, బ్యాంకర్స్, ధరణి-ఆర్.డి.ఓ. మంచిర్యాల  బెల్లంపల్లి శాఖల ఆధ్వర్యంలో స్టాళ్ళు ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

ప్రశంసా పత్రాల కొరకు వచ్చిన ప్రతిపాదనలను జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ), జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, కలెక్టరేట్ పరిపాలన అధికారి, ప్రొటోకాల్ విభాగం పర్యవేక్షకుల ఆధ్వర్యంలో పరిశీలించి, అర్హులను ఎంపిక చేయాలని తెలిపారు. వేడుకలలో ఉత్తమ సేవలు అందించిన ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక ప్రతినిధులకు ప్రశంసాపత్రాలు అందించడం జరుగుతుందని తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేసే దిశగా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.