Telugu Updates
Logo
Natyam ad

విద్యార్ధిని హత్య కేసులో సంచలన తీర్పు..!

గుంటూరు: గుంటూరు బీటెక్ విద్యార్ధిని రమ్య హత్య కేసులో ఫాస్టు ట్రాక్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. రమ్య హత్య కేసులో శశికృష్ణకు ఉరిశిక్షను కోర్టు విధించింది. గుంటూరులో 2021 ఆగష్టు 15న రమ్యను శశికృష్ణ కత్తితో పొడిచి చంపాడు. రక్తపు మడుగులో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు మరణించింది. అప్పట్లో ఈ ఘటన సంచలనమైంది. ఈ కేసు విచారణ 9 నెలల పాటు కొనసాగింది.
కేసు పూర్వాపరాల వివరాలిలా ఉన్నాయి… రమ్య ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చదువుతుంది. శశికృష్ణ పదో తరగతి చదివి ఆపాడు. రమ్యకు, శశికృష్ణకు సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఆధారంగా తనను ప్రేమించాలంటూ శశికృష్ణ రమ్య వెంట పడ్డాడు. దానికి ఆమె ఒప్పుకోలేదు. దీంతో రమ్య 2021 ఆగష్టు 15న ఉదయం టిఫిన్ కు బయటకు వచ్చింది. ఆ సమయంలో శశికృష్ణ రమ్య పై 8 కత్తిపోట్లు పొడిచాడు. దీంతో రమ్య పరిస్థితి విషమించి కన్నుమూసింది. నిందితున్ని అదే రోజు సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. 9 నెలలు కేసు విచారణ సాగి నిందితునికి ఉరిశిక్ష పడింది..