Telugu Updates
Logo
Natyam ad

నేను లంచం ఇవ్వను.. మీరూ ఇవ్వకండి..!

సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌ నుంచి మధిరకు ఓ వ్యక్తి పాదయాత్ర అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్ పంజాగుట్ట: నేను లంచం ఇవ్వను.. మీరూ ఇవ్వకండి అంటూ ఓ వ్యక్తి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌ వద్ద నుంచి ఖమ్మం జిల్లా మధిరకు పాదయాత్ర చేపట్టాడు. అనుమతి లేదంటూ పంజాగుట్ట పోలీసులు అతడిని అడ్డుకుని పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఖమ్మం జిల్లా, ఎర్రుపాలెం గ్రామానికి చెందిన మద్దినేని అనిల్‌కుమార్‌ వివరాలు వెల్లడించారు. ఉన్నత చదువులు చదివానని, కొద్ది కాలంపాటు అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఉద్యోగం చేసి తర్వాత రాష్ట్రానికి తిరిగి వచ్చానని చెప్పాడు. 2016 నుంచి ఎర్రుపాలెంలో ఉంటూ పైవ్రేట్‌ జాబ్‌ చేస్తున్నానని, ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్‌ అవసరమై ఎర్రుపాలెం మండల తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా, అప్పటి తహసీల్దార్‌ తనను లంచం అడిగారని, డబ్బులు ఇస్తేనే పని అవుతుందని చెప్పడంతో తాను అంగీకరించకపోవడంతో కేసులు నమోదు చేశారని తెలిపాడు. లంచానికి వ్యతిరేకంగా ప్రెస్‌క్లబ్‌ నుంచి మధిర న్యాయస్థానానికి పాదయాత్ర చేపట్టానన్నారు. నేను లంచం ఇవ్వను.. మీరు ఇవ్వకండని బోర్డును మెడలో వేసుకొని పాదయాత్ర చేస్తూ వెళ్తుండగా పోలీసులు అతడిని అడ్డుకొని స్టేషన్‌కు తరలించారు..