హైదరాబాద్: నగర శివారు తుక్కుగూడ వద్ద శనివారం రాత్రి కాల్పుల ఘటన కలకలం రేపింది. ఐరన్ లోడ్ తో వెళ్తున్న లారీపై కారులో వచ్చిన దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. గురి తప్పడంతో లారీ డ్రైవర్, క్లీనర్ కాల్పుల నుంచి త్రుటిలో తప్పించుకోగలిగారు. దీంతో లారీ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి.
లారీలోని ఐరన్ ను ఎత్తుకెళ్లేందుకే దుండగులు కాల్పులకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.