
ఆంజనేయులు న్యూస్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: జిల్లా కేంద్రాన్ని మున్సిపాలిటీగా చేయాలని అప్పటి రాష్ట్ర సహాయ మంత్రివర్యులు, ప్రస్తుత జిల్లా పరిషత్ చైర్మన్ కోవ లక్ష్మి ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును, ఐటీ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ ని గతంలోనే కోరడం జరిగింది. కోంత ఏజెన్సీ ప్రాంతం కావడంతో గతంలో రాజ్యాంగపరమైన ఇబ్బందులు రావడంతో మున్సిపాలిటీ గా కాలేదు. మరో మారు ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆసిపాబాద్ కొమురం భీం జిల్లా కేంద్రాన్ని మున్సిపాలిటీ చేయాలని అసెంబ్లీలో ప్రస్తావించడం అభినందనీయం. వీరందరి కృషి ఫలితంగానే కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాన్ని మున్సిపాలిటీగా మార్చేందుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం గ్రామ పంచాయతీగా ఉండగా. జిల్లా కేంద్రం పంచాయతీగా ఉండటం కరెక్ట్ కాదని, దాన్ని అభివృద్ధి చేసేందుకు మున్సిపాలిటీగా మారుస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. జనకాపూర్, గోడవల్లి గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్, కేటిఆర్, హరిష్ రావు, అదేవిధంగా నేడు జిల్లా అభివృద్ధి కి కృషి చేస్తున్న టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు జిల్లా జడ్పి ఛైర్ పర్సన్ కోవ లక్ష్మి కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏమెల్సీ దండే విఠల్ కు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు జిల్లా ప్రజానీకం ధన్యవాదములు తెలిపారు.

