Telugu Updates
Logo
Natyam ad

హెడ్ ఫోన్స్ తో వినికిడి సమస్య నిజమేనా..?

ఆంజనేయులు న్యూస్: చేతిలో సెల్ ఫోన్ ఉంటే చెవిలో ఇయర్, హెడ్ ఫోన్స్ ఉండాల్సిందే.. చిన్నారుల నుంచి మొదలు పెద్దల దాకా ఆటా, పాటా, మాటా వినేందుకు ఆసక్తి చూపిస్తారు. కొందరు కుర్రకారులైతే ఇయర్ బడ్స్ పెట్టుకొని సినిమాలే చూస్తున్నారు. చెవిలో ఇయర్ ఫోన్ పెట్టుకొని ప్రమాదాల బారిన సంఘటనలున్నాయి. ఇయర్ఫోన్స్ వినికిడి శక్తి కూడా బాగా తగ్గిపోతుందని, కొంతమందికి పూర్తిగా చెవుడు వస్తుందని వైద్యులు చెబుతున్నారు. వాటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈఎన్టీ సర్జన్ జానకి రామిరెడ్డి వివరించారు..

ఈ లక్షణాలు గమనించాలి: చెవులు బరువుగా అనిపించడం, చెవిలో నొప్పిగా ఉండటం, కుయ్ లాంటి శబ్దం వినిపించడం లేదా సముద్రపు ఘోష చెవిలో వినిపించినా వైద్యుల వద్దకు వెళ్లాలి.