Thursday, July 2, 2026
HomeTelanganaఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులిపురుగులను నిర్మూలిద్దాం.

ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులిపురుగులను నిర్మూలిద్దాం.

జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి.రాహుల్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులిపురుగులను నిర్మూలిద్దామని, జిల్లాలో ఈ నెల 28న జరుగనున్న జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా జిల్లాలోని పిల్లలందరికీ నులిపురుగు నివారణ కొరకు అల్బండజోల్ మాత్రలు పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి.రాహుల్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్, జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డా॥ ఎస్. అనిత, ప్రోగ్రామ్ అధికారి డా॥ నీరజ, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1 సం|| నుండి 19 సం||ల లోపు పిల్లలందరికీ ఆల్బండజోల్ మాత్రలు అందించే విధంగా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలోని 2 లక్షల 1 వేయి 143 మంది పిల్లలకు ఈ నెల 20వ తేదీన ఆల్బండజోల్ మాత్రలు అందించేందుకు కార్యచరణ రూపొందించడం జరిగిందని, ఆ రోజు మాత్రలు అందని ఈ నెల 27న మాప్ అప్ రౌండ్ ద్వారా అందించడం జరుగుతుందని, జిల్లాలోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలలో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. నులిపురుగులు ఉంటే పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనతతో అలసటతో ఉంటారని, శారీరక, మానసిక అభివృద్ధిలో మందకొడిగా ఉంటారని, నులిపురుగుల నివారణ కొరకు అల్బండజోల్ మాత్రలను అందించాలని తెలిపారు. చిన్నపిల్లలకు మాత్రలను పొడి చేసి నీటిలో కలిపి త్రాగించాలని, భోజనం చేసిన అనంతరం ప్రతి మాత్రను చప్పరించి తినే విధంగా చూడాలని తెలిపారు. నులిపురుగుల నుండి రక్షణ కోసం బహిరంగ ప్రదేశాలలో మల, మూత్ర విసర్జన చేయకూడదని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, మల విసర్జనను మరుగుదొడ్లను వినియోగించాలని, భోజనం చేసే ముందు, మరుగుదొడ్డి ఉపయోగించిన తరువాత చేతులను శుభ్రపర్చుకోవాలని, పండ్లను, కూరగాయలను శుభ్రమైన నీటితో కడగాలని, ఆహారాన్ని కప్పి ఉంచాలని, ఎల్లప్పుడూ పరిశుభ్రమైన నీటిని త్రాగాలని, పిల్లలను గోర్లను శుభ్రంగా ఉంచుకునేలా చేయాలని తెలిపారు. మాత్ర వేసిన తరువాత పిల్లలో వికారం, స్వల్ప కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, నీరసం వంటి లక్షణాలు రావచ్చని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అత్యవసర పరిస్థితులలో సమీప ఆరోగ్య కేంద్రానికి తీసుకురావాలని తెలిపారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలలో ఉదయం ప్రార్థన సమయంలో ఆల్బండజోల్ మాత్రలు, నులిపురుగుల నివారణ కొరకు తీసుకోవలసిన జాగ్రత్తలను విద్యార్థులకు తెలియజేయాలని, మండల స్థాయిలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, ఐ.సి.డి.ఎస్. అధికారులు సిబ్బందితో సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఆయా మండలాల పరిధిలోని పిల్లలకు మాత్రల పంపిణీతో పాటు నిర్వహించిన అవగాహన కార్యక్రమాలపై ప్రణాళిక రూపొందించుకొని అమలు చేయాలని తెలిపారు. జిల్లా సంక్షేమశాఖ, ఐ.కె.పి., విద్య, పంచాయతీ శాఖల అధికారులు, 108 అత్యవసర సేవలు, ప్రభుత్వ అసుపత్రులలో చిన్నపిల్లల వైద్యుల సమన్వయంతో అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

Post Midle

రానున్న వర్షాకాలంలో కీటక జనిత వ్యాధులు, అంటు వ్యాధులు, విషజ్వరాలు వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, జిల్లాలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఉప కేంద్రాలలో ప్రతిస్పందన బృందాలను ఏర్పాటు చేయాలని, ఆశా కార్యకర్తల వరకు ఎపిడమిక్ మందులను అందుబాటులో ఉంచాలని తెలిపారు. గత 2 సంవత్సరాల నుండి డెంగ్యూ జ్వరాలు వచ్చిన గ్రామాలలో తీసుకుంటున్న చర్యలపై నివేదిక అందించాలని, డెంగ్యూ జ్వరాల నియంత్రణపై కళాజాత ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. జిల్లాలో డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా చర్యలు చేపడుతున్నామని, ఇందులో భాగంగా జిల్లా ఆసుపత్రిలో, తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్ డెంగ్యూ పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, ప్రైవేట్ ఆసుపత్రులలో డెంగ్యూ సంబంధిత వివరాలను జిల్లా ఎపిడమిక్ సెల్లో 9177847667 నంబర్ లో సమాచారం అందించాలని తెలిపారు. అనంతరం కార్యక్రమం సంబంధిత గోడప్రతులు, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ అధికారి నీరటి రాజేశ్వరి, జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి గంగారాం, జిల్లా సర్వేయలెన్స్ అధికారి డా॥ ఫయాజ్, మున్సిపల్ కమీషనర్లు, జిల్లాలోని వైద్యాధికారులు, జిల్లా ఆసుపత్రి వైద్యులు, మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, వైద్య కళాశాల సిబ్బంది. సూపర్వైజర్లు, ఎం. ఎల్. హెచ్.పి.లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJ News App

Add to home screen for faster loading and latest updates.