Telugu Updates
Logo
Natyam ad

పరారీలో మాజీ ఎమ్మెల్యే.?

 

హైదరాబాద్: పటాన్ చెరు మండలం చినకంజర్ల శివారులో సర్వేనంబర్ 250లో మామిడితోటలో కోడి పందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పటాన్చెరు డీఎస్పీ భీమ్ రెడ్డీ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి దాడులు నిర్వహించారు. ఘటనా స్థలంలో 70 మంది ఉన్నారు. ఏపీలోని ఏలూరు జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అక్కినేని సతీష్, కృష్ణంరాజు, శ్రీనులు బృందంగా ఆడుతున్నారని ఆయన తెలిపారు. 21 మందిని పట్టుకున్నారు. రూ.13 లక్షలు, 26 వాహనాలు, 27 సెల్ ఫోన్ లు, 30 కోడి కత్తులు, 31 కోళ్లు స్వాధీనం చేసుకున్నారు. చింతమనేని ప్రభాకర్, కృష్ణంరాజులు పరారయ్యారని, అక్కినేని సతీష్, బర్ల శ్రీను పోలీసులు అదుపులో ఉన్నారని డీఎస్పీ తెలిపారు.