Monday, August 17, 2026
HomeTelanganaవిధులకు హాజరుకాని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలి.?

విధులకు హాజరుకాని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలి.?

📰 Generate e-Paper Clip

అదిలాబాద్ జిల్లా: ప్రభుత్వ పాఠశాల విధులకు హాజరుకాని ఉపాధ్యాయుల పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విభాగ సంఘటన కార్యదర్శి అనిల్ కోరారు. ఏబీవీపీ ఆదిలాబాద్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీతకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఏబీవీపీ విభాగ్ సంఘటన కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు విధులకు హాజరు కాకుండా విద్యార్థి జీవితాలను ఆగం చేస్తున్నారన్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల్ వడ్డాడి గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల అక్కడ ఉన్న ఉపాధ్యాయులు విధులకు సరిగా హాజరు కాకుండా తమకు నచ్చిన విధంగా వస్తున్నారని, కావున దీనిపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు.

ఇలాంటి సమస్యలపై వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేసారు. లేని పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నగర సంయుక్త కార్యదర్శి అక్షయ్, అరుణ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.