బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడిన ఉక్కుమనిషి, దేశ ప్రజలంతా ఒక్కటేనని, మనం భారతీయులమనే భావన తీసుకువచ్చి ఏకతాటిపై నిలిపిన మహామనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్
మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడిన ఉక్కుమనిషి, దేశ ప్రజలంతా ఒక్కటేనని, మనం భారతీయులమనే భావన తీసుకువచ్చి ఏకతాటిపై నిలిపిన మహామనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. సోమవారం వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నిర్వహించే జాతీయ సమైఖ్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తో కలిసి పాల్గొని వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.
దేశ స్వాతంత్ర ఉద్యమంలో సర్దార్ వల్లభాయ్ పలేట్ కీలక పాత్ర పోషించారని, స్వాతంత్ర్యం అనంతరం దేశంలోని అనేక సంస్థలను విలీనం చేశారని, అదే సమయంలో నిజాం సర్కార్ పాలిస్తున్న హైదరాబాద్ సంస్థానాన్ని నిజాంను ఎదురించి దేశంలో విలీనం చేశారని తెలిపారు. భారతదేశ తొలి ఉప ప్రధానిగా, హోమ్ మంత్రిగా విశిష్ఠ సేవలు అందించారని, అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు. ఐకమత్యం అనే నినాదంతో కుల, మత, వర్ణ, వర్గ, ప్రాంత బేధాలు లేకుండా దేశంలోని ప్రజలందరినీ ఏకం చేసి దేశ నమైఖ్యతను ప్రపంచానికి చాటారని తెలిపారు. అనంతరం దేశ సమగ్రత, సమైఖ్యత, అంతర్గత భద్రతను కాపాడతామని, దేశాభివృద్ధి కృషి చేస్తామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి నురేష్, జిల్లా ఖజానా అధికారి, జిల్లా పౌరసంబంధాల అధికారి సంపత్ కుమార్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

