Telugu Updates
Logo
Natyam ad

కేజీబీవీలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్..

ఆదిలాబాద్ జిల్లా: జిల్లాలో పాఠశాలల విద్యార్థులు అస్వస్థతకు గురికావడం కలకలం రేపుతోంది. మూడు రోజుల వ్యవధిలోనే వరసగా మూడవ పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. స్థానిక భీంపూర్ మండల కేజీబీవీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు సుమారు 70 మంది భోజనం చేసిన అనంతరం వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. అందులో నుండి సుమారు 40 మందిని రిమ్స్ కు తరలించి చికిత్సలు అందిస్తుండగా. మరి కొందరికి పాఠశాలలోనే ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో చికిత్సలు అందిస్తున్నారు. అదనపు కలెక్టర్ రీజ్వా న్ బాషా షేక్, డీ.ఎం.హెచ్.ఓ నరేందర్ రాథోడ్, డీ.ఈ.ఓ ప్రణీత తదితరులు పాఠశాల తో పాటు రిమ్స్ లో పరిస్థితిని సమీక్షించారు. ఘటనకు లో గల కారణాలపై స్థానిక అధికారులు, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే ఇటీవల మరమ్మతు చేసిన బోర్ వెల్ కు పైన కవర్ వేయకపోవడం వల్లనే ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. బోర్ వెల్ వద్ద ఎటువంటి రక్షణ కవచం లేకపోవడంతో నీరు కలుషితమై విద్యార్థులు అస్వస్థత కు గురైనట్లు భావిస్తూ ఆ దిశగా విచారణ చేపడుతున్నారు. ఇక ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని, విచారణలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం ఉందని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.