Friday, July 3, 2026
HomeTelanganaపార్టీపై అసత్య ఆరోపణులు మానుకోవాలి.

పార్టీపై అసత్య ఆరోపణులు మానుకోవాలి.

📰 Generate e-Paper Clip

రాష్ట్ర కార్యదర్శి సభ్యులు కళావేని శంకర్

Post Midle

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: సిపిఐ పార్టీకి మంచిర్యాల జిల్లాలో అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర ఉందని రాష్ట్ర కార్యదర్శి సభ్యులు కళావేని శంకర్ బుధవారం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లాలో వైస్ ఎంపిపిగా, ఎంపిటిసిలుగా, సర్పంచులు గా ప్రజలకు ప్రాతినిద్యం వహిస్తుందని అన్నారు. కార్మికులకు అనేక హక్కులు కల్పించిన బాధ్యత గల పార్టీ అన్నారు. కానీ నస్పూర్ లో పాలకవర్గ పార్టీ అంతర్గత విభేదాలతో సిపిఐ పార్టీ మీద ఆరోపణలు మానుకోవాలని హెచ్చరించారు. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగేలా మా పార్టీ కౌన్సిలర్లు ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయని అన్నారు. కమ్యూనిస్టు పార్టీ ప్రజలకు జవాబుదారీగా నిలబడుతుందని అన్నారు. మంచిర్యాల కమిషనర్ బాలకృష్ణ సతీమణి ఆత్మహత్యకు పాల్పడడం దురదృష్టకరమని, జ్యోతి కుటుంబానికి కమ్యూనిస్టు పార్టీ సీపీఐ సంతాపాన్ని తెలియజేస్తుందని అన్నారు. ఈ ఆత్మహత్య వెనుక అనేక ఆరోపణలు ఆ కుటుంబ సభ్యుల నుండి వస్తున్న నేపథ్యంలో పోలీసులు సమగ్ర విచారణ శిక్షించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శు రామడుగు లక్ష్మణ్, మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, నస్పూర్ కౌన్సిలర్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు, కౌన్సిలర్లు మేకల దాసు, రేగుంట చంద్రశేఖర్, మండల సహాయ కార్యదర్శి లింగం రవి, మిర్యాల రాజేశ్వరరావు, శకరపు కిరణ్, దొడ్డిపట్ల రవీందర్, మొగిలి లక్ష్మణ్, అల్ల లచ్చిరెడ్డి, నన్ని గౌడ్, అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJI News App

Add to home screen for faster loading and latest updates.