నకిలీ డాక్టర్ కేసులో ముగ్గురికి జైలుశిక్ష..
మంచిర్యాల జిల్లా: చెన్నూర్ పట్టణంలోని లక్ష్మీనరసింహ ఆస్పత్రిలో నకిలీ వైద్యురాలు బుక్యా నాగమణి, ఆమెకు సహకరించిన గంట రాంబాబు. ఆర్కాట్ రమేశ్ లకు మూడేళ్ల చొప్పున జైలుశిక్ష, జరిమానా విధిస్తూ సోమవారం స్థానిక జూనియర్ సివిల్ కోర్టు మేజిస్ట్రేట్ సంపత్ తీర్పునిచ్చారు. 2015లో నకిలీ ధ్రువపత్రాలతో ఎంబీబీఎస్ డాక్టర్ అంటూ నాగమణి వైద్యం చేయగా అప్పటి ఎస్సై చందర్ కేసు నమోదు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో నాగమణితో పాటు ఆమెకు సహకరించిన మరో ఇద్దరికి జైలు శిక్షతోపాటు జరిమానా విధించినట్లు సిఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.