Telugu Updates
Logo
Natyam ad

టెన్త్ ఎగ్జామ్స్.. పేపర్ లీక్..!

ఆంద్రప్రదేశ్, ఆమడగూరు: పదో తరగతి పరీక్షల్లో భాగంగా ఇవాళ ఇంగ్లిష్ పరీక్ష జరుగుతోంది. పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే (ఉదయం 10గంటలకే ప్రశ్నపత్రం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. శ్రీ సత్యసాయి జిల్లా ఆమడగూరు పాఠశాల నుంచి పదో తరగతి ఇంగ్లిష్ పేపర్ లీకైనట్లు తెలుస్తోంది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాల్సి ఉంది. పరీక్షల మొదటిరోజు తెలుగు ప్రశ్నపత్రం సోషల్ మీడియాలో ప్రత్యక్షమవగా.. రెండోరోజు హిందీ ప్రశ్నపత్రం బయటకు రావడం గమనార్హం. స్థానిక అధికారులు మాత్రం తమ వద్ద లీక్ కాలేదంటూ వివరణలు ఇచ్చిన విషయం. తెలిసిందే..