మాజీ ఎమ్మెల్సీ నివాసంలో ఉగాది పండుగ వేడుకలు..
మంచిర్యాల జిల్లా:
ఎఐసిసి సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో శనివారం ఉగాది పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వేద పండితులు పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో అన్ని వర్గాల ప్రజలు పాడిపంటలు, అస్టైశ్వర్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, పార్టీ, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.