Telugu Updates
Logo
Natyam ad

ఆ యాప్ వాడొద్దు.. వినియోగదారులకు వాట్సాప్ సూచన!

ఆంజనేయులు న్యూస్: ఇది వాట్సాప్ (WhastApp) లాంటిదే…. అచ్చంగా అలాగే ఉంటుంది… అందులో లేని ఫీచర్లు ఇందులో దొరుకుతాయి! – ఇలాంటి మాటలు, మెసేజ్ లు మీరు వినే ఉంటారు.. చూసే ఉంటారు కూడా. అయితే వీటిని ఎంత మాత్రం విశ్వసించొద్దని టెక్ నిపుణులు చెబుతున్నా నకిలీ వాట్సాప్ లు (Fake WhatsApp) వాడి ఇబ్బంది పడుతున్నవాళ్లు చాలామంది ఉన్నారు. తాజాగా మరో నకిలీ వాట్సాప్ ఆన్లైన్ లో అందుబాటులోకి వచ్చింది. దీంతో వాట్సాప్ సీఈవో తమ ఆండ్రాయిడ్ (Android) వినియోగదారులకు జాగ్రత్తలు చెబుతూ కొన్ని సూచనలు చేశారు.

గత కొన్ని రోజులుగా టెక్ సర్కిల్ లో, ఆన్లైన్ లో ఓ యాప్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అదే ‘హే వాట్సాప్’. ఈ యాప్ ను ‘హే మోడ్స్’ అనే డెవలపర్ రూపొందించారు. వాట్సాప్ సీఈవో విల్ కాథ్ కార్ట్ దీనిపై వినియోగదారులకు సూచనలు, జాగ్రత్తలు చెప్పారు. “వాట్సాప్ పేరుతో వస్తున్న ఎలాంటి నకిలీ యాప్లను వాడొద్దు. ఒకవేళ వాడితే మీరు చాలా ఇబ్బందుల్లో పడతారు”. అంటూ విల్ హెచ్చరించారు. ఇలాంటి నకిలీ యాప్ ల  వల్ల వ్యక్తిగత సమాచారం తస్కరణకు గురవుతుందని తెలిపారు.