మంచిర్యాల పట్టణ సిఐ నారాయణ నాయక్
ఎవరైనా నిబంధనలు అతిక్రమించినట్లయితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు.
మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పట్టణ పరిధిలో శోభ యాత్రలకు ఏలాంటి డీజేల అనుమతి లేదని ఎవరైనా నిబంధనలను అతిక్రమించి నట్లయితే చట్టపరమైన చర్యలు తప్పవని మంచిర్యాల పట్టణ సిఐ నారయణ నాయక్ గురువారం విలేకరుల సమావేశంలో తెలిపారు. కొంతమంది ర్యాలీ లు నిర్వహిస్తూ డిజే లను వాడుతున్నారు. ఎవరైనా డిజే లు ఉపయోగిస్తే వీడియోగ్రఫీ తో రికార్డు చేసి యాత్రకు సంబంధించిన వ్యక్తుల పై మరియు డిజేల యజమానులపై కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది అని అన్నారు. శాంతి సంఘం సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అన్ని మతాల పెద్దలతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి తగిన సూచనలు చేయడం జరిగిందని అన్నారు. ప్రజలందరూ పోలీస్ వారికీ సహకరించి శాంతియుత, ప్రశాంతమైన వాతావరణంలో పండగలు జరుపుకోవాలని కోరారు.. ఈ సమావేశంలో సీఐ తో పాటు ఎస్సైలు తైసుద్దీన్, గంగారాం ఉన్నారు…