
ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: ఆదివాసి సంస్కృతి సంప్రదాయాలు, ఎంతో గొప్పవని ఎమ్మెల్యే రామన్న అన్నారు. సోమవారం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని కచ్కంటి, యాపల్ గూడ, రాముల గూడ గ్రామాలలో నిర్వహించిన దండారి ఉత్సవాలలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు ఆదివాసులు ఘన స్వాగతం పలికారు. నెమలి ఈకలతో తయారుచేసిన టోపీ ధరించి సందడి చేశారు. అనంతరం దండారి ఉత్సవాలను ఎమ్మెల్యే తిలకించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పదివేల నగదు ప్రోత్సాహాన్ని గ్రామస్తులకు అందజేశారు. ఎమ్మెల్యే వెంట డీసీసీబీ చైర్మన్ ఆడ్డి భొజా రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ మనోహర్, ఎంపీపీ గండ్రత్ రమేష్, ఆత్మ డివిజన్ చైర్మన్ జిట్ట రమేష్, నాయకులు జగదీష్, రమణ, నరేష్, ప్రహ్లాద్ తదితరులు పాల్గొన్నారు.

