Telugu Updates
Logo
Natyam ad

దళితబంధు యూనిట్లు పొందిన లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలి

మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

మంచిర్యాల జిల్లా: దళితుల అభ్యున్నతి, ఆర్థికాభివృద్ధి కొరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు కార్యక్రమం మొదటి విడతలో యూనిట్లు పొందిన లబ్దిదారులు వాటిని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదిగి స్థిరపడాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్ లో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తో కలిసి జిల్లా అధికారులు, రాజస్వ మండల అధికారులతో దళితబంధు నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దళితబంధులో దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు కేటాయించిన యూనిట్లను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. జిల్లాలో 251 యూనిట్లకు గాను ఇప్పటి వరకు 167 వివిధ యూనిట్లను దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు అందించడం జరిగిందని, మిగిలిన 84 యూనిట్ల పరిశీలన త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. వ్యవసాయ రంగంలో ఎరువులు, విత్తనాలు, ఫర్టిలైజర్, ఫిష్ పాండ్, కూరగాయల సాగు కోసం 10 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారని, పరిశ్రమల స్థాపనలో భాగంగా సిమెంట్ బ్రిక్స్, పేపర్ ప్లేట్స్, గ్లాస్ మేకింగ్, సంట్రింగ్ యూనిట్ల కొరకు 5 మంది దరఖాస్తు చేసుకున్నారని, చెప్పులు, పెయింట్ షాపులు, మినీ సూపర్ బజార్, కిరాణం, హార్డ్వేర్ & సానిటరీ, కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్స్, ఎలక్ట్రికల్ టూ వీలర్ స్పేర్ పార్ట్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్ షోరూమ్ల కొరకు 13 మంది దరఖాస్తు చేసుకున్నారని, సర్వీస్ & సప్లయి విభాగంలో డొమెస్టిక్ ల్యాబొరేటరీ, మెడికల్ షాప్, టెంట్ హౌజ్, డి.టి.ఎస్. సౌండ్ సిస్టమ్, ఫ్లెక్సీ ప్రింటర్ కొరకు 25 మంది దరఖాస్తు చేసుకున్నారని, రవాణా విభాగంలో 4 గూడ్స్ వెహికల్స్, 1 మొబైల్ టిఫిన్ సెంటర్, ట్రాక్టర్ & ట్రాలీ, గ్రూపుగా కలిసి ఒక హార్వెస్టర్, 4 ప్రజారవాణా వాహనాల కొరకు 31 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.

యూనిట్లు లబ్దిదారులతో కలిసి వారికి కేటాయించిన యూనిట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అర్హత, అనుభవం క్షుణ్ణంగా పరిశీలించి రేపటిలోగా నివేదిక అందించాలని తెలిపారు. యూనిట్ల సంబంధిత కంపెనీలతో చర్చించి పరికరాల పంపిణీలో రాయితీ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు..