Telugu Updates
Logo
Natyam ad

భార్యను కత్తితో పొడిచి పరారైన భర్త..?

ఆదిలాబాద్ జిల్లా బోథ్: పండగపూట విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో భార్యను కత్తితో పొడిచి భర్త పరారయ్యాడు. ఈ ఘటన సిరికొండ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. సిరికొండ మండల కేంద్రంలోని మహాలక్ష్మివాడకు చెందిన సూర్య వంశీ యమునాజీ తన భార్య సునీతను శుక్రవారం మధ్యాహ్నం కత్తితో పొడిచి పరారయ్యాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రగాయాలైన క్షతగాత్రురాలును 108 అంబులెన్స్ వాహనంలో చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.