Thursday, July 2, 2026
HomeTelanganaసీఎం కేసీఆర్ ప్రధాన సలహాదారుగా సోమేశ్ కుమార్

సీఎం కేసీఆర్ ప్రధాన సలహాదారుగా సోమేశ్ కుమార్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన సలహాదారుగా విశ్రాంత ఐఏఎస్ సోమేశ్ కుమార్ నియమితులయ్యారు.

Post Midle

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన సలహాదారుగా విశ్రాంత ఐఏఎస్ సోమేశ్ కుమార్ నియమితులయ్యారు. ఈమేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధాన సలహాదారుకు కేబినెట్ హోదా కల్పిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సోమేశ్ కుమార్ ఈ పదవిలో 3ఏళ్ల పాటు కొనసాగనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు సోమేశ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
గతంలో సోమేశ్ కుమార్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అయితే, సోమేశ్ కుమార్ ను ఆంధ్రప్రదేశ్ కు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. ఈ విషయంలో కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దు చేయడంతో ఆయన ఏపీకి బదిలీ అయ్యారు. ఏపీలో జాయిన్ అయిన కొద్ది రోజుల తర్వాత ఆయన వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారు

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJ News App

Add to home screen for faster loading and latest updates.