పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతున్న: మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని గోదావరి నదీ తీరాన స్మశానవాటిక నిర్మాణం కోసం స్థలం కొనుగోలు వ్యవహారంలో పెద్దఎత్తున ఆర్థిక కుంభకోణం దాగి ఉంధని మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు ఆరోపించారు. ఆదివారం ఆయన పాత్రికేయులతో కలిసి శ్మశాన వాటిక కొనుగోలు స్థలాన్ని సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ స్మశాన వాటిక స్థలం కొనుగోలులో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ప్రమేయం ఉందన్నారు. గోదావరి నది బ్యాక్ వాటర్ తో నీట మునిగే స్థలానికి రూ. 1.20 కోట్లు ఎకరానికి ఎలా ఖర్చు చేస్తారని ఆయన ప్రశ్నించారు. గోదావరి నదిలో మునిగి పోయే స్థలాన్ని కోటి రూపాయలతో ఎందుకు కొనుగోలు చేయడంలో ఆంతర్యమేమిటో ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రజలకు స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
స్మశాన వాటిక నిర్మాణంకు తాను వ్యతిరేకం కాదని, విరాళాల రూపంలో సేకరించిన డబ్బులను ఒకరిద్దరు వ్యక్తుల జేబుల్లోకి వెళితే తాను ఎంత మాత్రం సహించబోనన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.