Friday, July 3, 2026
HomeTelanganaసెల్ ఫోన్ కొనివ్వలేదని భార్య ఆత్మహత్య

సెల్ ఫోన్ కొనివ్వలేదని భార్య ఆత్మహత్య

📰 Generate e-Paper Clip

Post Midle

ఆంజనేయులు న్యూస్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: వాంకిడి మండల కేంద్రానికి చెందిన అంజుం బేగం(22) అనే వివాహిత తన భర్త సెల్ ఫోన్ కొనివ్వలేదని మనస్తాపం చెంది గురువారం మధ్యాహ్నం ఇంట్లో భర్త లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య కు పాల్పడిందని వాంకిడి ఎస్ఐ సాగర్ తెలిపారు. వివరాల లోకి వేళితె,. మీర్జా జావీద్ బేగ్ కు అంజుం బేగం కు గత ఐదు సంవత్సరాల క్రితం వివాహం కాగా వీరికి ఇద్దరు సంతానం కలరు. జీవనోపాది కోసం కూలి పని చేస్తూ వాంకిడి మండలంలో వీరి కుటుంబం జీవిస్తున్నారు. కాగా గత కొంత కాలంగా భార్య సెల్ ఫొన్ కొనివ్వమని భర్తను పదే పదే అడగడం, భర్త తన వద్ద డబ్బులు లేవని చెప్పుతూ వస్తున్నాడు. ఎంతకీ సెల్ ఫోన్, ఫోన్ కొనివ్వకపోయేసరికి తీవ్ర మనస్తాపానికి గురైన భార్య అంజుం బేగం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సాగర్ తెలిపారు.

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJI News App

Add to home screen for faster loading and latest updates.